తాలిబన్ల అధీనంలోకి ఆఫ్ఘనిస్థాన్.. ప్రాణభయంతో పరుగులు

తాలిబన్ల అధీనంలోకి ఆఫ్ఘనిస్థాన్ : ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో భారీ సంఖ్యలో జనం ప్రాణభయంతో ఆ దేశం నుంచి పారిపోతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులు, సొంత దేశానికి చెందిన వారు కూడా విదేశీ విమానం కోసం కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. ( Vehicle Scrappage Policy  )

రాత్రంతా విమానాల కోసం పడిగాపులు కాస్తున్నారు. అక్కడ ఏ విమానం కనిపించినా అందులో ఎక్కి ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్ ఎంతైనా సరే ఇచ్చేందుకు సిద్ధపడి, తమకు విమానంలో టిక్కెట్లు ఇవ్వాలని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వందలాది మంది విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. ఈ తొక్కిసలాటలో కొందరు విమానం పై నుంచి కింద పది మరణించడం జరిగింది.

అటు తాలిబన్ల అరాచక పాలన మొదలైన వేళ ఆఫ్ఘనిస్తాన్ జైలు నుంచి ఖైదీలు బయటకు వస్తున్న దృశ్యం అక్కడ నెలకొన్న దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఇక దేశంలో తమకు రక్షణ లేదని ఆ దేశ మహిళలు వాపోతున్నారు.

ఇక మన దేశానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన C – 17 గ్లొబ్ మాస్టర్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ( c-17 globemaster military aircraft ) కాబూల్ లో ఉంది. ఎయిర్ ఇండియా విమానం ద్వారా భారతీయులని తరలించడం కుదరకపోతే ఈ యుద్ధ విమానం ద్వారా తరలిస్తారు. కానీ ఇప్పుడు ఘఘన తలాన్ని మూసివేయడం వల్ల ఎయిర్ ఇండియా విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

నిన్న ఎయిర్ ఇండియా విమానంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఇవాళ మరో విమానం అక్కడి నుంచి ఉదయం బయలుదేరాలి. కానీ అక్కడే ఆగిపోయింది. ఇలా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు భయానకంగా మారాయి.

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు తదుపరి కర్తవ్యంగా రివేంజ్ స్టోరీ కూడా నడుపుతున్నారని సమాచారం. అంటే ఎవరైతే తమకు వ్యతిరేకులు అని అనుకుంటున్నారో.. వారందరినీ నిర్బంధించి కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

More Latest telugu newsOnline telugu newsPolitical newsonline news today