పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్ : చైనా వైరస్ ల తయారీలో మేటి. పాక్ టెర్రరిస్టుల తయారీలో మేటి. వైరస్ మరియు టెర్రరిస్ట్.. ఈ రెండూ మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అయితే పాముకి పాలు పోసి పెంచితే కాటేసినట్టుగా.. పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్టులు ఆ దేశాన్ని అదే చేస్తున్నారు. ( చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..? )
ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ లతో పాటుగా ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద ముఠాలకు మద్దతు ఇవ్వడం ద్వారా, ప్రపంచంలో ఒంటరైన పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు ఎగరడంతో మొత్తం అక్కడి యంత్రాంగమే ఉలిక్కిపడిన పరిస్థితి. ఆఫ్ఘన్ తాలిబన్ల వశమైనప్పుడు పలుచోట్ల సంబరాలు చేయించిన ఇమ్రాన్ ఖాన్ కు ఇది తగిన గుణపాఠం. గత నెల 15న కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోగానే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటుగా, అనేక ప్రాంతాల్లో తాలిబన్ జెండాలు ఎగురవేసి, ర్యాలీలు నిర్వహించారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
ఈ సంఘటనలన్నీ మీడియా కూడా కవర్ చేసింది. దాంతో తాలిబన్ కు, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్టయింది. అసలు విషయానికి వస్తే గడచిన ఆదివారం ఇస్లామాబాద్ లోని జామియా హఫ్సా మదర్సాలో తాలిబన్ జెండాలు రెపరెపలాడాయి. అపవాదు భయంతో భయాందోళనకు గురైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. తాలిబన్ జెండాలను తొలగించడానికి పోలీసులను పంపినప్పటికీ.. ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. ( Panjshir | పంజ్ షీర్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు ! )
మదర్సా నిర్వాహకుడు మౌలానా అబ్దుల్ అజీజ్ పోలీసులను బెదిరించినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ నగరం నడి మధ్యలో ఉన్న జామియా హఫ్సా టెర్రస్ పై తాలిబాన్ జెండా ఊపుతూ మతోన్మాదులు మల్లె కనిపించరు. పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి జెండాలను దించమని కోరగా.. అందుకు వారు నిరాకరించారు. పోలీసులతో మదర్సా నిర్వాహకుడు అజీజ్ గొడవపడి బహిరంగంగానే బెదిరించినట్లు తెలుస్తోంది. పోలీసులు వచ్చే సమయానికి అజిత్ చేతిలో తుపాకీతో దర్శనమిచ్చినగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా మదర్సా టెర్రస్ పై తాలిబన్ జెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం అబ్దుల్ అజీజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆతర్వాత జెండాలను తీసివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. తప్పులు జరిగే చోట మీరు ఉండాలి.. అంతేగాని పిల్లలను భయపెట్టడానికి మదర్సాకు రావొద్దు.. ఇక్కడ చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తే ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది అని చెప్పినట్టుగా ఆ వీడియోలో మనకు వినిపిస్తుంది.
1 thought on “పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్”