ఆన్లైన్ చదువులు కుదరని పని..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న పాఠశాలలపై దృష్టి పెట్టాయి. అన్ని పాఠశాలలు మరియు హాస్టళ్లు మూసివేయాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం దీనికి సంభందించి అసెంబ్లీలో ప్రకటన కూడా చేసింది. నేటి నుంచి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లు మూసివేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించాయి. విద్యాబోధన ఆన్లైన్ లోనే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆన్లైన్ లో బోధించడం సాధ్యపడని పని అని .. ఇప్పటికే చాల వరకు చదువును కోలోయారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడం కుదరదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ యధావిధిగా స్కూల్స్ నడిపిస్తామని ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా తమ పిల్లలను స్కూల్స్ కి పంపాలని అయన అన్నారు.

Leave a Comment