ఆధార్ తో డ్రైవింగ్ లైసెన్స్ .. ఇక ఆన్ లైన్ లో ..

కవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో వాహనదారులు ఆర్ టిఎ ఆఫీసులకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే సేవలను అందించాలనే ఉద్దేశంతో ఐటీ మంత్రిత్వ శాఖ కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. ఆధార్ కార్డుతో ఆన్ లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరించే అవకాశం కల్పించింది ఐటీ శాఖ.

అందరూ బయో మెట్రిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా అన్ని రకాల ఆన్ లైన్ సేవలైన లెర్నింగ్ లైసెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్, వాహనాలా ఆర్ సి అప్డేట్ వంటి సంబంధిత సేవలు పొందవచ్చు.

ఇప్పటివరకు ఆన్ లైన్ లో డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్ వంటి సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాటి అనుసంధాన సర్వీసులను ఆధార్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకు రావాలని రోడ్డు రవాణా శాఖా, ఐటీ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

దీని వల్ల నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్న కొందరు డ్రైవర్లను నిరోధించవచ్చని పేర్కొంది.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇంటి వద్ద నుండే ఆన్ లైన్ ద్వారా ఈ సదుపాయాలూ వినియోగించుకోవచ్చు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసే లక్ష్యంతో Aadhaar authentication, ఇన్నోవేషన్ లో భాగంగా ఈ నిబంధనలను చేర్చింది. దీని వలన పరిపాలన సౌలభ్యం, ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ( వైఎస్ జగన్. )

కాగా 2018 లోనే డ్రైవింగ్ లైసెన్స్ కి ఆధార్ తప్పనిసరి అని రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయాన్ని సుప్రీమ్ కోర్టు తప్పు పట్టడంతో ప్రభుత్వం ఉప సంహరించుకుంది. అయితే కొన్ని సవరణలతో ఆధార్ ని ఐడెంటిటీ ప్రూఫ్ గా వినియోగించుకునేలా 2019లో పార్లమెంట్ లో బిల్ పాస్ చేశారు.

Leave a Comment