అచ్చెన్నాయుడు ఈసారి NRI ఆసుపత్రికి…

ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడును NRI ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరులోని రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అచ్చెన్నాయుడుకు కరోనా సోకినట్లు రమేష్‌ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

Leave a Comment