దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పుడు తెలంగాణా ఆర్.టి.సీ. కూడా ఈ మేరకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేస్తోంది.
ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్
అందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆ పిల్లలకు 12 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు తెలంగాణలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్.టి.సీ. నిర్ణయించింది.అదేరోజు 120 రూపాయలు ఉన్న డేపాస్…కేవలం 75 రూపాయలకే అందించాలని నిర్ణయించారు.అలాగే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు కూడా ఈ ఆగస్టు 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!
- పార్టీ నేతలకు తలనొప్పిగా మారిన టీఆర్ఎస్ విజయ గర్జన సభ.. అసలు జరుగుతుందా..?
తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు టీఎస్ ఆర్.టి.సీ. వారు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 75 రూపాయలు తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఆగస్టు 15న 75 కిలోమీటర్ల దూరం వరకు కిలో బరువు వున్న అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు.