జగన్ ట్వీట్ వెనుక ఇంత లాజిక్ ఉందా.. !!

సామాన్యుల ఆలోచన శక్తికి.. ఆలోచన విధానానికి కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు రాజకీయ పార్టీల అధినేతలు. అందుకే రాజకీయ పార్టీలు పెట్టగలుగుతున్నారు.. సీఎంలు అవుతున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, ఊహాత్మక ఎత్తుగడలు అందుకు నిదర్శనం.

ప్రధాని మోడీ ప్రభావం మసకబారుతున్న వేళ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ ప్రతిష్టకు గట్టిగానే డామేజ్ జరిగిన నేపథ్యంలో.. ఇంకా మరింతగా ఆయనపై దాడి జరగకుండా ప్రతిపక్షాలను నివారించేందుకు వీలుగా జగన్ ఓ ట్వీట్ చేసి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక బీజేపీ అగ్ర నాయకత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగుడుతూ ఆయనకు మద్దతుగా ఛత్తీస్ ఘడ్ సీఎంకు సున్నితంగా చురకలంటిస్తూ ట్వీట్ చేశారు సీఎం జగన్. కరోనా కట్టడిలో మోడీ విఫలమయ్యారని ప్రపంచమంతా అంటున్న సమయంలో ఆయనకు బహిరంగంగా మద్దతు తెలిపిన ఏకైక వ్యక్తి సీఎం జగన్.

ఇటువంటి సమయంలో ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సైతం అవాక్కయ్యారు. జగన్ ట్వీట్ వెనుక కారణం ఏమిటి అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో ఆలోచనలు రేకెత్తిసున్నాయి.

తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక తర్వాత చంద్రబాబు మరోసారి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని, బిజెపికి సంకేతాలు పంపాలని కూడా నిర్ణయించుకున్నారట. తిరుపతిలో టీడీపీ పార్టీ ఓటు బ్యాంకు 7 శాతం తగ్గిపోవడంతో పాటు.. బీజేపీ, జనసేన పొత్తు వల్ల భవిష్యత్తులో వచ్చే పొలిటికల్ ఈక్వేషన్స్ ను అంచనా వేసిన చంద్రబాబు, బిజెపి అగ్ర నాయకత్వంకి ఓ సంకేతం పంపాలని నిర్ణయించారట.

ఏపీలో పొత్తు పెట్టుకుందాం.. కలిసి నడుద్దాం.. గతం కంటే బిజెపికి అధిక సీట్లు ఇస్తాను.. దీంతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు 2014 ఎన్నికల బంధాన్ని కొనసాగిస్తామని సంకేతాలు పంపించాలని అనుకున్నారట. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఎంత ఘోరంగా ఓడిపోయిందో ఇప్పటికే ఆ పార్టీకి బోధ పడుతుండడంతో, సరైన సమయంలో.. సరైన వ్యూహం సరైన ఈక్వేషన్ ద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారట.

ఇక ఈ విషయాన్ని టీడీపీ నుంచి తెలుసుకున్న సీఎం జగన్ అత్యంత వ్యూహాత్మకంగా ప్రధాని మోడీ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. తద్వారా మోడీ ఇమేజ్ ను కాపాడడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాము, బిజెపికి అవసరమైన సమయంలో సంపూర్ణ మద్దతు ఇస్తాము అంటూ బీజేపీ హైకమాండ్ కు ట్వీట్ ద్వారా తన వైఖరిని, తమ పార్టీ వైఖరి ఏంటో చెప్పారు. సీఎం జగన్ ట్వీట్ తర్వాత బీజేపీ హైకమాండ్ కు చంద్రబాబు పంపాలనుకున్న సంకేతాలకు బ్రేక్ పడిందట.

అయితే చంద్రబాబు బిజెపికి పంపిస్తాం అనుకున్నా సంకేతాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి లీక్ చేసింది ఎవరు..? ఆ అజ్ఞాతవాసి ఎవరు..? అంటూ చంద్రబాబు ఆరా తీయడం మొదలు పెట్టారట. ప్రధాని మోడీకి మద్దతుగా సీఎం జగన్ చేసిన ట్వీట్ వెనుక అసలు రహస్యం ఇదే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Leave a Comment