50 కిలోమీటర్లు ప్రయాణం.. కేవలం ఇంటర్నెట్ కోసం..

Online schools

ఈ కరోనా నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవు. ఈ విషయమై ఒక విద్యార్థి జిల్లా అధికారికి ఫిర్యాదు చేసాడు.

మహారాష్ట్రకు చెందిన రత్నగిరి జిల్లా మారుమూల గ్రామంలో సుమారు 200 మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు హాజరు కావడానికి సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. ( డిజిటల్‌ విద్య .. అమలు సాధ్యమేనా.. !! )

ఇటీవల అక్కడ కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం బాగా దెబ్బ తినడమే కాకుండా కరెంటు, సెల్ టవర్ సర్వీసులు నిలిచిపోయాయి. కావున ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం స్కూల్ టీచర్లకు తప్పని సరి కావడంతో పిల్లలు కూడా రావాలని ఆదేశించారు. దీంతో ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావాలంటే 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తోందంటూ ఒక విద్యార్థి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ కి ఫిర్యాదు చేసాడు.

Leave a Comment