DRDO రూపకల్పనలో మరో కొత్త డ్రగ్ .. ! 2-Deoxy-D-glucose

2-Deoxy-D-glucose | ప్రపంచమంతా ఇప్పుడు కరోనా పేరు వినగానే ఉలిక్కి పడుతోంది. చైనాలో మొదలైన ఈ భయంకరమైన వైరస్ అతి తక్కువ కాలంలో ప్రపంచమంతా విస్తరించింది. ఈ మహమ్మారిని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారతీయ వాక్సిన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా రోగుల కోసం DCGI మరొక ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మెడికల్ ఆక్సిజన్ మరియు హాస్పిటల్ లో పడకల కొరతను తగ్గించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI ) covid -19 రోగులకు అత్యవసర ఉపయోగం కోసం యాంటీ కోవిడ్ ఔషధానికి అనుమతినిచ్చింది.

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) ప్రయోగశాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ( INMAS ) చే 2 డీఆక్సీ డీ గ్లూకోజ్ 2DG తయారు చేయబడింది. అయితే ఆసుపత్రిలో చేరిన కోవిడ్ బాధితులు తొందరగా కోలుకోవడానికి ఈ డీఆక్సీ డీ గ్లూకోజ్ ఉపయోగపడుతుంది.

2 డీజీ తో చికిత్స పొందిన రోగులలో RTPCR ప్రతికూల మార్పులు చూపిస్తుంది. తద్వారా ఎంతో మంది రోగులు కోలుకునే అవకాశం ఉంటుంది. covid -19 తో బాధపడుతున్న వారికి ఈ డ్రగ్ ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ ఔషధం పొడి రూపంలో మనకు లభిస్తుంది. దీనిని నీటిలో కరిగించి ద్రవరూపంలో తీసుకోవాలి.

ఇది కోవిడ్ సోకిన వారి శరీరంలో ప్రభావం ఎలా చూపిస్తుంది అంటే.. వైరస్ సోకిన కణాలలోకి చొచ్చుకుపోయి వైరస్ ఉత్పత్తి శక్తి ని ఆపడం ద్వారా వైరస్ పెరుగుదలను నియంత్రిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేషెంట్ల కష్టాలు చాలా దయనీయమైనవిగా వున్నాయి. ఆక్సిజన్ సకాలంలో అందక కొందరు, ఆసుపత్రుల్లో పడకలు దొరక్క కొందరు, వ్యాక్సిన్ను దొరక్క కొందరు విలవిలలాడిపోతూ ఉన్నారు. అయితే అతి భయంకరమైన covid -19 సెకండ్ వేవ్ నడుస్తున్న ఈ తరుణంలో ఈ డ్రగ్ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Leave a Comment