ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. రాజధాని కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ విజయవాడకు చెందిన విద్యార్థిని వేమూరు లీలా కృష్ణా పిటిషన్ వేశారు. అయితే ప్రత్యక్ష ప్రసారం కోసం పిటిషన్ వేసిన విద్యార్థి కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు.
వికేంద్రీకరణ చట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది అని పిటిషినర్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించారని.. ఇప్పుడు మూడు రాజధానుల నినాదం గత ప్రభుత్వ విధానాలను పక్కన పెట్టడంతో పాటు భూసమీకరణ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని విద్యార్థిని విమర్శించారు.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తే న్యాయ స్థానాలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు అవకాశం ఉంటుందని కూడా అభిప్రాయపడ్డారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను కూడా పిటిషనర్ ప్రస్తావించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన కొంతమంది న్యాయమూర్తులపై అస్పష్టమైన ఆరోపణలతో లేఖ రాయడం న్యాయ పరిపాలనకు అభ్యంతరం తెలపడమేనని.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదని పిటీషినర్ విమర్శించారు.
విద్యార్థిని కోరినట్లు రాజధాని కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తే చాలా మంచి పరిణామం అవుతుంది. మూడు ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రత్యక్ష ప్రసారం చేస్తే అమరావతి భూములు ఇచ్చిన వారితో పాటు మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా ఈ కేసులో ఎలా వ్యవహరిస్తున్నారో అన్నది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.
కాకపోతే ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏ కేసులోనైనా పార్టీలుగా ఉన్న వారికి వారి వారి కేసులు చాలా ప్రాధాన్యమైనవి. ఇప్పుడు ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అంగీకరిస్తే మిగిలిన కేసుల్లోనూ ఇలాంటి డిమాండ్లు రావచ్చు. ఒకప్పుడు చట్ట సభల్లో ప్రత్యక్ష ప్రసారం ఉండేది కాదు. ప్రత్యక్ష ప్రసారాలు వచ్చిన తర్వాత నేతల గురించి, సభల తీరుతెన్నులు గురించి ప్రజలు బాగా తెలుసుకోగలుగుతున్నారు.
ప్రత్యక్ష ప్రసారాల వల్ల చట్టసభల మీద గౌరవం పెరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు అవకాశం వచ్చింది. ఒకవేళ పిటిషినర్ విజ్ఞప్తి చేసినట్లు ప్రత్యక్ష ప్రసారానికి కోర్టు అంగీకరిస్తే న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకత తెచ్చినట్లవుతుంది. పలు దేశాల్లో ఇప్పటికే ఈ పద్ధతి ఉంది. మనదేశంలో తీసుకురావాలనే చర్చ చాలాకాలంగా సాగుతూ ఉంది. కాకపోతే లైవ్ ప్రచారాల వల్ల ధీరత్వాన్ని చూపించాలన్న ఉద్దేశంతో చట్టసభల్లో పలువురు రాజకీయ నాయకులు హద్దులు దాటుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. గతం ఎలా ఉన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు రహస్యాలు లేని ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. నవంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే రాజధాని కేసు తుది విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …