మా చానెళ్లకు అనుమతినివ్వండి : టీడీపీ ఎమ్మెల్సీలు ..!!

నవంబర్ 30వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టిడిపి ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్ బాబు లు శాసన మండలి ఛైర్మెన్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ABN ,టివీ5, ETV మూడు ఛానెళ్ల తరపున టీడీపీ ఎమ్మెల్సీలు ఈ వినతిపత్రం ఇచ్చారు.

ఈ మూడు చానెళ్లకు కూడా సమావేశాలను ప్రసారం చేసే వీలు కల్పించాలని ఆ వినతిపత్రంలో మండలి చైర్మన్ ను వీళ్ళు విజ్ఞప్తి చేశారు. ABN ,టివీ5, ETV ఈ మూడు చానెళ్లు అసెంబ్లీ సమావేశాల ప్రసారాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. దీన్ని వెంటనే తొలగించాలి అని విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ మూడు ఛానళ్ల పైన ఆంక్షలు విధించింది అన్నది ఇప్పుడు జరిగినది కాదు. గతంలో 2019 ఆఖరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ఈ వ్యవహారం జరిగింది. అందుకు గల కారణాలు కూడా అప్పట్లో అధికారులు వెల్లడించారు.

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు, సభలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు సభలోని కార్యక్రమాన్ని కాకుండా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నేతల ప్రసంగాన్ని ప్రచారం చేయకూడదు అన్నది ఒక నిబంధనగా ఉంది.

గతంలో కొన్ని టీవీ ఛానళ్లు తమకు నచ్చిన పార్టీలకు వంత పాడాలి అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో సమావేశాల్లో కీలకమైన చర్చలు జరుగుతుండగానే వాటిని ప్రసారం చేయకుండా తమకు నచ్చిన పార్టీల నాయకులు మీడియా పాయింట్ వద్ద చేసే ప్రసంగాలనే సుదీర్ఘంగా లైవ్ ఇస్తూ వచ్చాయి.

అసెంబ్లీ ఖ్యాతిని కూడా దెబ్బతీసే విధంగా ఈ చానెళ్లు వ్యవహరిస్తున్నాయనే ఉద్దేశంతోనే చాలా కాలం క్రితమే ఒక నిబంధన పెట్టారు. అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద ప్రత్యక్ష ప్రసారాన్ని ఇవ్వకూడదు అన్నది ఒక నిబంధన.

2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ABN ,టివీ5, ETV ఈ మూడు చానెళ్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి అన్నది ఆరోపణ. అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతుండగానే వాటిని ప్రసారం చేయకుండా మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసే ప్రసంగాలను లైవ్ ఇవ్వడాన్ని గుర్తించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఈ మూడు ఛానెళ్ల పైన ఆంక్షలు విధించారు.

ఆ మూడు ఛానెళ్ల ప్రతినిధులకు అసెంబ్లీ పాసులు కూడా అధికారులు అప్పట్లో జారీ చేయలేదు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే అసెంబ్లీ సమావేశాలకు ఈ మూడు చానెళ్లను తాము దూరంగా పెట్టినట్టు కూడా అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. ఈ ఆంక్షలను ఎత్తివేయాలని ఇప్పుడు మండలి చైర్మన్ కు టిడిపి ఎమ్మెల్సీలు వినతిపత్రం ఇచ్చారు.

ఆంక్షలు విధించింది అసెంబ్లీ స్పీకర్. అయితే శాసనమండలి చైర్మన్ టిడిపి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు కాబట్టి తమకు అనుకూలంగా ఆదేశాలు ఇస్తారన్న ఉద్దేశంతో కాబోలు మండలి చైర్మన్కు ఈ మూడు ఛానెళ్ల తరఫున టీడీపీ ఎమ్మెల్సీలు వినతిపత్రం ఇచ్చారు. అయితే మండలి చైర్మన్ కనీసం ఈ మండలి వరకైనా ఈ ఛానళ్ళని అనుమతి చేస్తారా అన్నది చూడాలి.

అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కాదని మండలి చైర్మన్ సొంతంగా నిర్ణయం తీసుకున్నా అవి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయా అన్నది కూడా చూడాలి. వ్యవస్థ మొత్తం ప్రభుత్వం, అధికారుల చేతిలోనే, అసెంబ్లీ స్పీకర్ చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి. మొత్తానికి ఈ మూడు చానెళ్ల తరఫున టీడీపీ ఎమ్మెల్సీలు మద్దతుగా వినతిపత్రం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Comment