మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవాలి మరి..

అనవసరంగా సంబంధం లేని విషయాల్లో తలదూర్చినందుకు చంద్రబాబు నాయుడుకు బాగానే అయింది. జగన్ మోహన్ రెడ్డి పై నోరు పారేసుకోవడానికి ఏ చిన్న అవకాశం వస్తుందా అని చంద్రబాబు ఎదురు చూస్తూ ఉంటాడు. ఘటన తో నిజంగానే జగన్ కు సంబంధం ఉందా లేదా అన్నది కూడా చూడడు. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్లుగానే వుంది జగన్ విషయంలో చంద్రబాబు పరిస్థితి.

తాజాగా విశాఖ నగరంలో సబ్బంహరి ఇంటి కాంపౌండ్ వాల్ ను జివిఎంసి అధికారులు కూల్చేశారు. దాంతో సబ్బం ఒళ్ళు మరిచిపోయి నోటికొచ్చిన బూతులన్నీ ప్రయోగించాడు. సబ్బం పూనకాన్ని చుసిన చంద్రబాబు కూడా రెచ్చిపోయి ప్రభుత్వాన్ని, జగన్ ను నోటికొచ్చినట్లు మాట్లాదేసాడు. తీరా చూస్తే ఆవేశం తగ్గిపోగానే తానూ ఏం మాట్లాడాడో సబ్బంకు అర్థమయింది. అందుకని భేషరతుగా జగన్ కు, ఉన్నతాధికారులకు క్షమాపణలు చెప్పుకున్నాడు.

సీన్ కట్ చేస్తే బూతులు తిట్టిన సబ్బం క్షమాపణలు చెప్పుకున్నాడు బానే ఉంది.. వారి సబ్బం ని చూసి అవసరం లేకపొయినా ఆవేశాన్ని తెచ్చుకొని ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు సంగతేంటి. ఇక విషయం ఏంటంటే సబ్బం మున్సిపల్ పార్కు స్థలం 200 గజాలు ఆక్రమించుకున్నాడు. స్థలాన్ని ఆక్రమించుకున్న సబ్బం అందులో టాయిలెట్లు కట్టుకున్నాడు.

విశాఖ మేయర్ గా, ఎంపీ గా చేసిన సబ్బం కు తాను చేస్తున్నది తప్పని బాగా తెలుసు. తెలిసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంత కాలం ఎంత మంది ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పదేళ్ళు సబ్బమే ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన కారణంగా అధికార వ్యవస్థ మొత్తం మారి పోయింది.

2014లో విభజన తర్వాత సబ్బం అధికార పార్టీ టిడిపిలో చేరారు కాబట్టి సబ్బం జోలికి ఎవరూ రాలేదు. సీన్ కట్ చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి కూడా సబ్బం ఆక్రమణలపై ఫిర్యాదు అందాయి. దాంతో అన్ని విషయాల పైన విచారణ జరిపిన ప్రభుత్వం అక్రమాలపై నోటీసులు ఇచ్చింది. నోటీసులను తీసుకోవడానికి సబ్బం రిజక్ట్ చేయడంతో దాన్ని ఇంటికి అంటించేశారు. మరుసటి రోజు తెల్లవారు జామున కాంపౌండ్ కూల్చేశారు.

మరి ఈయనకు ఏంటి బాధ

తాను ఆక్రమించుకున్న స్థలాన్ని మున్సిపాలిటీ వారు తిరిగి స్వాధీనం చేసుకోవడాన్ని సబ్బం తట్టుకోలేక పోయాడు అంటే అర్థం ఉంది. మరి చంద్రబాబు కి ఏమైంది. గుద్దిగా సబ్బంను సమర్థించడమేనా. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న సబ్బం కు గడ్డి పెట్టాల్సిన చంద్రబాబు, తన స్థాయిని తానే దిగజార్చుకున్నట్లు అయింది. మొత్తం మీద ట్విస్ట్ ఏంటంటే.. తాను అనవసరంగా ఆవేశపడి జగన్ మరియు ఉన్నతాధికారులను తిట్టినందుకు సబ్బం క్షమాపణలు చెప్పుకోవడం.

ఈ ఒక్క కేసే కాదు.. చాలా విషయాల్లో చంద్రబాబు ఇలాగే దిగజారిపోయి వ్యవహరిస్తున్నాడు. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ప్రతీ విషయాన్ని జగన్ కు ముడిపెడుతూ నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏమంటే జగన్ అంటే చంద్రబాబుకు నిలువెత్తునా కసితో మండిపోతున్నాడని.

జగన్ ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూడలేకపోతున్నాడు. పైగా జాతీయ స్థాయిలో జగన్మోహన్రెడ్డి పాపులారిటీ పెరుగుతుండడాన్ని కూడా తట్టుకోలేక పోతున్నాడు. దాంట్లో నుండే చంద్రబాబుకు కసి పుట్టుకొస్తోంది. ఈ పద్ధతి చంద్రబాబుకే మంచిది కాదు. మరి ఎంత కాలం ఇలాంటి రాజకీయాలు చేస్తాడో చూడాలి మరి.

Leave a Comment