మహారాష్ట్రలో భవనం కూలిన ఘటన ..35కు చేసిన మృతుల సంఖ్య..

మహారాష్ట్ర ముంబైలోని భీవండిలో సోమవారం తెల్లవారుజామున భవనం కూలిన ఘటనలో దాదాపు 20 మంది వరకు మృతి చెందారు. అయితే ఈ మరణాల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తుంది. బుధవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 35కు చేరినట్టు ఈ ఘటన సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు.

శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
సహాయక చర్యల్లో భాగంగా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటివరకు దాదాపు 30 మందిని రక్షించినట్లు సమాచారం. భవనం పాతబడి శిథిలావస్థకు చేరుకోవడంతోనే ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ( సోషల్ మీడియాలో వైరల్ .. )

రాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో భవనం కుప్పకూలడంతో మరణాల సంఖ్య అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.

Leave a Comment