కొంపకు నిప్పుపెట్టిన కొరివి దెయ్యం కొండెక్కి కోలాటమాడిందట… ఇప్పుడు చైనా తీరు చూస్తుంటే అలానే ఉంది.
కరోనా మహమ్మారిని ఈ ప్రపంచం మీదకు వదిలింది కాక ఇప్పుడు వింత వింత వేషాలు వేస్తోంది. ఓ వైపు కరోనా నుంచి బయట పడేందుకు దేశాలన్నీ చమటోడ్చుతుంటే.. చైనా మాత్రం ఫ్యాషన్ షో అంటూ హోరెత్తిస్తుంది.
రెగ్యులర్ ఫ్యాషన్ షో అయితే ఓకే కానీ చైనా పాలకుల వెరైటీ ఆలోచనే వెగటు పుట్టిస్తోంది. అసలు విషయానికి వస్తే తమ కంపెనీలు తయారు చేసిన పిపిఈ కిట్ల అమ్మకాలు పెంచుకునేందుకు చైనా డాంగ్ డాంగ్ ఫాషన్ వీక్ పేరుతో ఓ ఫాషన్ షో నిర్వహించింది.
చైనా నార్త్ ఈస్ట్ ప్రావిన్స్లోని లియావొనింగ్ లో ఈ ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో వివిధ కంపెనీల పిపిఈ కిట్లు ధరించిన మోడల్స్ స్టేజిపై రాంప్ వాక్ చేశారు. రంగురంగుల పిపిఈ కిట్లతో హొయలొలికించారు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది.
ఇలా మహమ్మారిని కూడా మనిగా మార్చుకునేందుకు డ్రాగన్ వేసిన వెర్రి వేషాలే వెగటు పుట్టిస్తున్నాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి మూలకూ చేరిపోయింది. వైరస్ బారిన పడని ప్రదేశం అంటూ లేదు. అగ్ర దేశాలను సైతం వణికిస్తోంది ఈ కరోనా.
ఈ మహమ్మారి చైనాలోని వుహాన్ లో పుట్టింది అనేది నిర్వివాదాంశం. ఈ విషయంలో చైనా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. రాబోయే విపత్తులు ప్రారంభదశలోనే గుర్తించి ప్రపంచ దేశాలను అలెర్ట్ చేయడంలో చైనా పూర్తిగా విఫలమైంది.
డ్రాగన్ నిర్లక్ష్యంతో మొదట వుహాన్ లో స్థానికంగా వ్యాపించిన ఈ వైరస్, కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతా పాకిపోయింది. దాదాపుగా 7 కోట్ల మంది వైరస్ బారిన పడగా సుమారు 16 లక్షల మందికి బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రారంభ దశలోనే వైరస్ ను గుర్తించి కట్టడి చేయడం చేతకాలేదు కాని మెడికల్ ఎక్విప్మెంట్లు మార్కెట్ పెంచుకునేందుకు భారీ స్కెచ్ వేసింది డ్రాగన్.
ఇబ్బడిముబ్బడిగా పీపీఈ కిట్లు, ఇతర రక్షణ సామాగ్రిని తయారు చేసి ప్రపంచం మీదకి వదిలింది. మహమ్మారి ప్రారంభంలోనే చైనా అనేక దేశాలకు ఎగుమతి చేసింది. అయితే నాణ్యతా ప్రమాణాల విషయంలో చైనా పిపిఈ కిట్లు, ఇతర రక్షణ సామాగ్రి అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి.
తాము దిగుమతి చేసుకున్న పిపిఈ కిట్లు లోపభూయిష్టంగా ఉన్నట్లుగా గుర్తించిన స్పెయిన్, టర్కీ, చెక్ రిపబ్లిక్, బ్రిటన్, భారత్ తో పాటుగా పలు దేశాలు చైనా పై దుమ్మెత్తిపోశాయి. 2020 ఏప్రిల్ లోనే చైనా నుంచి భారత్ 60 వేల కోవిడ్ సామగ్రిని దిగుమతి చేసుకుంది. అయితే ఇవి నాణ్యత పరీక్ష ముందు నిలువలేక పోయింది.
అటు చైనా కిట్ల కోసం స్పెయిన్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా తో పాటుగా బ్రిటన్లోని ఆరోగ్యశాఖలు చైనా కంపెనీలకు మిలియన్ డాలర్లు చెల్లించాయి. కానీ ఆ దేశాలు అందుకున్న కిట్లన్నీ లోపభూయిష్టంగా మారాయి. చైనా నుంచి నెదర్ ల్యాండ్ 6 లక్షల మాస్క్ లు దిగుమతి చేసుకుంటే అందులో ఒకటి అంటే ఒక్క శాతం కూడా నాణ్యత ప్రమాణాలు అందుకోలేకపోయింది.
మొత్తానికి నకిలీ పిపిఈ కిట్లు, ఇతర కోవిడ్ సామగ్రిని విక్రయించడానికి, కొనుగోలుదారులను మోసగించడానికి చైనా నకిలీ పరిశ్రమలకు కరోనా మహమ్మారి కొత్త అవకాశాన్ని అందించింది. ఈ ఏడాది మార్చి 12 నాటికి చైనా అధికారులే లక్షలాది నాణ్యత లేని రక్షణ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
వీటిలో ఎనిమిది కోట్ల మాస్క్ లు, 37 వేల క్రిమి సంహారకాలు ఉన్నాయంటే చైనా కంపెనీల మెడికల్ టెక్నాలజీ ఎంత దరిద్రం గా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా చైనా ప్రభుత్వం నకిలీ పరిశ్రమలను ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంది. పైగా ఫాషన్ షోలను నిర్వహిస్తూ అమ్మకాలు పెంచుకోవడానికి పిచ్చి వేషాలు వేస్తోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …