నూతన రెవిన్యూ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన రెవిన్యూ బిల్లు శాసన సభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంలో సభలో బిల్లుపై చర్చ మొదలైంది.

చర్చలో కాంగ్రెస్, ఎంఐఎం మరియు బిజెపి సభ్యులు పలు సూచనలు చేసారు. అనంతరం సిఎం కెసిఆర్ దానిపై సమాధానం ఇస్తూ అందులో పొందు పరిచిన అంశాలపై సుధీర్ఘంగా వివరించారు. ( జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ..? )

రెవిన్యూ బిల్లుకు సంభందించిన తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ బుక్ ల బిల్లు 2020 ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ సభలో ప్రకటించారు. సభను మళ్ళీ సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.

Leave a Comment