ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ..

దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో మళ్ళీ కరోనా కేసులు పెరగటం మొదలైంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగటంపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇది రెండో దశ మొదలుకు సంకేతమని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ నెల ప్రారంభంలో అనూహ్యంగా రోజుకు 4 వేల వరకు కేసులు పెరగటం సెకండ్ వేవ్ కు ఉదాహరణగా కేజ్రీవాల్ చెప్పారు. ఇలా కరోనా వైరస్ రెండో దశ ప్రారంభమైందని ప్రకటించిన తొలి రాష్ట్రం ఢిల్లీనే కావడం విశేషం. దేశ రాజధానిలో ఇంతలా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేసే అంశంగా ఆయన చెప్పారు. ( వీరితోనే చాలా ప్రమాదం : CDFD )

ఢిల్లీలో సెప్టెంబర్ 9వ తేదీన తొలిసారి 4 వేల కేసులు దాటటంతో పాటు అదే రోజు సుమారు 20 మంది వరకు మరణించారు.మళ్ళీ సెప్టెంబర్ నెల 16 వ తేదీన దాదాపు 4500 కేసులు నమోదు కాగా …తరువాత క్రమంగా తగ్గినట్టు కనిపించింది. అయితే గత 24 గంటల్లో కరోనా కేసులు మళ్లీ 3700 నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులు మొదట మన దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించటం మొదలైనప్పటికీ, తొందరగా అదుపులోకి వచ్చింది కూడా ఢిల్లీలోనే అని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇలా మళ్ళీ కేసులు పెరగటం నగర వాసుల్లో కొంత ఆందోళన కలిగించే అంశమే. ఇప్పటికే దేశంలో 57 లక్షల వరకు కేసులు దాటాయి, 91 వేల మంది మృతి చెందారు.

Leave a Comment