2024 సంవత్సరం ఎన్నికల నాటికి ఏపీలో అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో బీజేపీ ఆలోచనలు చేస్తోంది. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకునే పనిలో పడింది. పార్టీని ఆ దిశగా నడిపించేందుకు ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి బీజేపీ సహకరించిందన్న విమర్శలను ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు.
అందులో భాగంగానే ఈ మధ్యనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కోల్పోయిన కన్నా లక్ష్మీనారాయణ ఆచరించిన ఘర్‌వాపసీ మంత్రాన్ని వల్లించారు. ఘర్‌వాపసీ అంటే పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను, కార్యకర్తలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే పని అన్నమాట. కానీ, ఈ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఈ తరుణంలోనే ఢిల్లీలోని కమలనాథులు కన్నాను పక్కనబెట్టి ఏపీ బీజేపీ పదవిని సోము వీర్రాజుకు అప్పగించారు. ఇప్పుడు ఆయన కూడా ఇదే ఘర్‌వాపసీ సూత్రాన్నే అమలుచేస్తున్నట్టు సానిపిస్తుంది. దీంతో బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల్లోనూ దీనిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఇంతకీ ఏంచేయాలనుకుంటున్నారు
అందరితో మంచి సంబంధాలు ఉండే కన్నా లక్ష్మీనారాయణ పిలిస్తేనే మాజీ నేతలు ఎవరూ తిరిగి పార్టీలోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు సోము వీర్రాజు పిలిస్తే వస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇటీవల జరుగుతున్న పరిణామాలను , రాష్ట్రంలో హిందూ ఓటు బ్యాంకును తన పార్టీవైపు మలుచుకునేందుకు బీజేపీకి అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా సోము వీర్రాజు అడుగులు వేస్తున్నారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారని చెప్పొచ్చు.
ఇక అసలు విషయం ఏమిటంటే .. ఏపీ బీజేపీలో ఘర్ వాపసీ నినాదంతో ముందుకు వెళ్లాలని సోము నిర్ణయించుకోవడమే! అంటే.. వివిధ కారణాలతో పార్టీని విడిచి పెట్టి వెళ్లిన సీనియర్లు, యాక్టివ్‌గా లేని నాయకులకు పార్టీలో మళ్ళీ అవకాశం ఇవ్వాలని సోము నిర్ణయించుకున్నారట. నిజానికి ఒక్క శ్రీకాకుళం,కర్నూలు, విజయనగరంలో తప్పితే.. మిగిలిన జిల్లాల్లో బీజేపీకి ఎంతోకొంత ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఉంది.
గతంలో నాయకులు అనేక నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున నిలబడి గెలిచినా వారు వున్నారు. విజయవాడ సెంట్రల్లో కోట శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ స్థానం నుంచి కంభంపాటి హరిబాబు, కైకలూరులో కామినేని శ్రీనివాస్, తాడేపల్లిగూడెంలో దివంగత మాణిక్యాలరావు, రాజమండ్రి సిటీ నుంచి ఆకుల సత్యనారాయణ ఇలా.. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గతంలో గెలిచిన సందర్భాలున్నాయి.
అయితే, కారణాలు ఏమైనా.. ఇప్పుడు సీనియర్ నాయకులు కొందరు సైలెంట్ గా ఉండగా.. మరికొందరు నేతలు పార్టీలు కూడా మారిపోయారు. ఇంకొందరు వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు. వారిలో సీఎం రమేష్,ఆదినారాయణ రెడ్డి, సుజనాచౌదరి, అన్నం సతీష్ ప్రభాకర్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. వీరిని కలుపుకుంటూనే, మరోపక్క, వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే.. బీజేపీ బలోపేతం అయ్యే అవకాశముందని అనుకుంటున్నారట సోము. పైగా వచ్చే ఎన్నికల నాటికి ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినా.. వెతుకులాట లేకుండా నేతలను ముందే తయారు చేసుకోవడం కూడా ఈ వ్యూహం పనికి వస్తుందని భావిస్తున్నారు.
కానీ, కన్నాకి సాధ్యం కానిది ఇప్పుడు సోము వీర్రాజు పిలిస్తే ఎందుకు వస్తారు.. అప్పటికీ,ఇప్పటికీ పార్టీ పరిస్థితుల్లో పెద్దగా ఏం తేడా వచ్చింది. చూడాలి, ఎంతవరకు సోము వీర్రాజు ప్రయత్నాలు ఫలిస్తాయో.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …